తీయని భావన స్నేహం

Friendship is a feeling that is not takenమనసులో ఒక కొత్త భావన స్నేహం
వీడని బంధం స్నేహం
వర్ణన లేని ప్రయాణం స్నేహం
జ్ఞాపకాల పరువం స్నేహం
ప్రేమానురాగాల మారుపేరు స్నేహం
ఇద్దరి మధ్య అపార సంబంధం స్నేహం
స్నేహం ఒక కొత్త అనుభవం
స్నేహం అందరి బలం
స్నేహం గమ్యం లేని ప్రయాణం
కష్ట సుఖాల్లో తోడుండేది స్నేహం
అద్భుతాలను సృష్టించేది స్నేహం
దేనినైనా జయించగలిగేది స్నేహం
ఎంతకైనా తెగించేది స్నేహం
వెన్నెలలోని హాయిదనం నీ స్నేహం
పువ్వులలోని స్వచ్ఛదనం నీ స్నేహం
నాకు అందించిన గొప్ప వరం స్నేహం
– వి.రేష్మిత అఖిల్‌ శ్రీ,
10వ తరగతి, అరవింద మోడల్‌ హైస్కూల్‌