– కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరి రూరల్
జూన్ 2వ నుండి 22 వరకు 21 రోజుల పాటు జరగనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల గురించి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల”ను జూన్ 2వ నుంచి 22వ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింనందున ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆవిష్కరించినట్లు తెలిపారు. ఆ దిశలో బాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉత్సవాలు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతి శాఖ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసి వారు పాల్గొనే స్థలం ముందుగానే తెలుసుకోవాలని, 2014 లో జరిగిన సంక్షేమ , అభివద్ధి పథకాలు, ఇప్పుడు జరుగుతున్న గురించి ప్రతి శాఖ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరించాలని , ప్రతి శాఖ నిర్వహించే దశాబ్ది ఉత్సవాల లోగో , బ్యానర్లు విరివిగా పెట్టాలని, వెల్ఫేర్ స్కీమ్స్ లో బాగంగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు , రైతు భీమ లాంటి అనేక సంక్షేమ పథకాలు ఏమైనా పెండింగ్ ఉంటే లబ్ధిదారులకు ఈ దశాబ్ది ఉత్సవాలలో అందజేయాలని తెలిపారు. అనంతరం జూన్ 2న కలెక్టరేట్ లో జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల గురించి వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేయాల్సిన పనులను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.