మెటా నుంచి ఓపెన్‌ సోర్స్‌ ఎఐ

వాషింగ్టన్‌ : కృత్రిమ మేధ (ఎఐ)పై అనేక మంది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన పెంచుతున్న క్రమంలో ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా కూడా కొత్తగా ఓపెన్స్‌ సోర్స్‌ ఎఐని ఆవిష్కరించింది. దిగ్గజ ఐటి కంపెనీలన్నీ గత కొంతకాలంగా ఎఐ దృష్టి సారిస్తున్నాయి. తాజాగా మెటా కూడా ఈ రంగంలో విస్తరించడానికి సిద్దం అయ్యింది. తామె కూడా ఓపెన్‌ సోర్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ను ప్రారంభిస్తున్నట్లు మెటా సిఇఒ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ చాట్‌ జిపిటి, గూగుల్‌ బార్డ్‌ చాట్‌బాట్‌లకు పోటీగా మెటా దీన్ని తెచ్చింది. ఓపెన్‌ సోర్స్‌ ఎఐని ఉచితంగా అందించనున్నామని జుకర్‌బర్గ్‌ తెలిపారు.