ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితం కొనసాగించడం కష్టంగా మారింది. అయితే మీకు తెలుసా మీ స్మార్ట్ ఫోన్ మీకు తెలియకుండానే ఎంతో నష్టాన్ని కలిగిస్తోంది. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే వెలుగు నుంచి కంటి చూపును, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం…
– మీరు ఎక్కువ సమయం ఫోన్‌తో గడిపేలా యాప్స్‌ను డిజైన్ చేస్తారు. కనుక యాప్స్ కు బదులుగా వెబ్ సైట్స్ విజిట్ చేయడం ప్రారంభించండి.
– మీ ఫోన్ లో ఉన్న Do Not Disturb అనే అప్షన్ ను తరచూ వినియోగించండి.
– బ్లూ టూత్ హెడ్ సెట్ వాడటం వల్ల మీ కళ్ల నుంచి ఫోన్ ను కాస్త దూరంగా ఉంచవచ్చు.
– టైమ్ చూసుకోవడానికి కూడా చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. దానికి బదులు మీ రెగ్యులర్ వాచ్‌ను చూడటం ప్రారంభించండి. ఈ విధంగా మీ లైఫ్ స్టైల్లో ఈ చిట్కాలు పాటించి మీ కంటిచూపును కాపాడుకోవచ్చు.