హైదరాబాద్ : ఫెడరేషన్ ఆప్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్‌టిసీసీఐ) కొత్తగా జీఎస్‌టీపై సర్టిఫికెట్ కోర్సును నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 12 నుండి నాలుగు వారాల పాటు ప్రతి గురు, శుక్రవారాల్లో శిక్షణ ఉంటుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 2న ముగుస్తుందని తెలిపింది. నిష్ణాతుల ఆధ్వర్యంలో తరగతులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొంది.