
వీర్నపల్లి మండలం కేంద్రంలో శనివారం బిఎస్పీ మండల నూతన కార్యవర్గం ను బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎనగందుల వెంకన్న,జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రు నాయక్, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల అశోక్,నియోజక వర్గ కార్యదర్శి ఇసంపల్లి కొమురయ్య,అధ్వర్యంలో మండల నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. మండల అధ్యక్షులుగా గజ్జెల ప్రశాంత్, ఉపాధ్యక్షులు: కొల్లపాక అనిల్, గుంటుకు తిరుపతి, ప్రధాన కార్యదర్శి కన్నం జనార్ధన్, కోశాధికారి తడగొండ సాయిలు, కార్యదర్శులు గజ్జెల శ్రీనివాస్, జింక సుధాకర్, జింక శంకర్, పర్లపల్లి సతీష్ ,బీవీఎఫ్ కన్వీనర్ ఆత్మకూరి సంజయ్ లు ఎన్నికయ్యారు. మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్ నా యొక్క నియామకానికి సహకరించిన జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టి అభివృద్ధి కీ కృషి చేస్తాననీ అన్నారు.