ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని మానుకోవాలి: ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్

నవతెలంగాణ- రామారెడ్డి :  ప్రతిపక్షాలు అధికార పార్టీపై చేసే దుష్ప్రచారాన్ని మానుకోవాలని ప్రభుత్వ విప్పు, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదివారం అన్నారు. మండలంలోని జగదాంబ తండా, స్కూల్ తాండ, బట్టు తండాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాప, ప్రారంభోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కామారెడ్డిలో కెసిఆర్ పోటీ చేస్తున్నాడని, కెసిఆర్ వస్తే భూములు లాక్కుంటారని దుష్ప్రచారం చేస్తున్నారని, గజ్వేల్ లో ఎక్కడ కూడా భూములు లాక్కోలేరని, ప్రాజెక్టుల క్రింద రైతుల భూములు కోల్పోతే, కేంద్ర ప్రభుత్వం చెప్పిన ధరకు, రైతులకు నష్టపరిహారం అందించామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించిందని, పనిచేసే వారిని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, సర్పంచులు రాజు నాయక్, లలితా బుచ్చిరెడ్డి, రెడ్డి నాయక్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రామ్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు రాజా గౌడ్, ఎంపీటీసీ సత్యాలి చంద్రు నాయక్,మండల బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి, ఎంపీడీవో సవిత, పంచాయతీ కార్యదర్శులు అరవింద్ రెడ్డి, రాజేష్, ప్రజాప్రతినిధు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.