నవతెలంగాణ-చిట్యాల
అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మూడోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి మరింత అభివృద్ధి చేసేం దుకు ప్రజలు అవకాశం ఇవ్వాలని భూపాలపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్య టిస్తూ కారు గుర్తుకు ఓటువేయలని ప్రచారాన్ని జోరుగా కొన సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. అందుకు అనుగుణంగా ఎన్నికల మానిఫెస్టోను వివిధ పార్టీలకు భిన్నంగా ప్రజా శ్రేయస్సు కోసం రూపొందిం చబడిందని తెలిపారు. పేద ప్రజానీకం కోసం ఆలోచించి సీఎం కేసీఆర్ ప్రజా ఆమోగ్య యోగ్యమైన మానిఫెస్టోను రూ పొందించాలని అన్నారు. నాటి ప్రభుత్వం మూడు గంటల కరెంటు, 200 వందలు పింఛన్ ఇవ్వడానికి ప్రజల్ని తిప్పలు పెట్టేదని గుర్తు చేశారు. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 24 గంటల కరెంటు ఇస్తూ రైతన్నలకు గృహాలకు ఆసరా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు అనేక పథకాలతో మేలు జరుగుతుందని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్య మంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. మరో సారి ఎమ్మెల్యే గా సేవ చేసే భాగ్యం తనకు కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని దూత్‌పల్లీ కోతపెట లక్ష్మీపురం తండా,ఒడితల, పాశిగడ్డతండా,గోపాల్ పూర్, గ్రామాలలో ఎన్నికల ప్రచారం విస్తతంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధావు వినోద వీరారెడ్డి జెడ్పిటిసి సాగర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మడికొండ రవీందర్రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.