ఉత్తమ విద్యార్థిగా గంగాధర్..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ కి చెందిన విద్యార్థి బానవత్ గంగాధర్ కు బుధవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ లింబాద్రి పది వేల రూపాయల చెక్కును, సర్టిఫికెట్ ను అందజేసి అభినందించారు. ఉత్తమ విద్యార్థిగా ఎన్నికైన ఎంసిఎ ద్వితీయ సంవత్సర విద్యార్థి బానవత్ గంగాధర్ రాబోవు రోజుల్లో మరింత మేరుగైన కృషి చేసి అన్నింటిలో ముందుండాలని పేర్కొన్నారు. ఉత్తమ విద్యార్థిగా ఎంపిక కావడంతో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి, ప్రిన్సిపాల్ ఆరతి లు అభినందించారు.