గరిబొం కె గలేమే హార్‌

Garibom ke galame harఅందం ఆహార్యం
దాచేస్తే దాగనివి
మూసేస్తే మాయనివి

దండలమ్ముకునే అమ్మాయిని
దండేసి దండం పెట్టె స్థాయికి తెచ్చాయి
మంగళ హారతులు పట్టే దర్పాన్ని కట్టబెట్టాయి

అందానికి చలాకితనం తోడై
అనంత కళారూపాన్నందించాయి
అందనంత అందలమెక్కించ్చాయి

పేదింటి బిడ్డ పరమాన్నం తినబోయే
పర్వదినాన్ని తెచ్చి పెట్టాయి
సిరివరుల్లా, సురుల సహజ సుందర
వదనాన్నావిష్కరించాయాయి

కుంభమేళాలో కోట్లాది శిరస్సులుత్తుంగ తరంగమా
సామాన్యుల తలరాతలు మార్చే సామాజిక మాధ్యమా
జోహార్‌ – జోహార్‌ – గరిబోం కె గలెమే హార్‌
హాంయార్‌ – హాంసబ్‌ యార్‌-బాటో సబ్‌ మే ప్యార్‌
– ఎస్‌.ఏ. సమద్‌, 9160100486