ఐదు ప్రభుత్వ పాఠశాలకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు

– ఎంఈఓ ఆంధ్రయ్య 

నవతెలంగాణ- కమ్మర్ పల్లి :
మండలంలోని ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు నూతనంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బాధ్యతల స్వీకరించినట్లు మండల విద్యాధికారి ఆంధ్రయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా కే. రాజన్న, కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పి. సాయన్న, హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా డిఎల్ ఎన్ చారి, కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా బి. మధుపాల్, కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సిహెచ్ రాంప్రసాద్ బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఆదివారం జరిగిన పదోన్నతుల్లో ప్రమోషన్ పొంది  గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా మండలంలో జాయిన్ అయినట్లు ఎంఈఓ  పేర్కొన్నారు.