గీత కార్మికుని కుటుంబానికి 5లక్షల చెక్కు అందజేత..

నవతెలంగాణ – డిచ్ పల్లి
హైదరాబాద్ లోని కోకాపేటలో గౌడ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా గత కొన్ని రోజుల క్రితం తాటిచెట్టుపై నుండి పడి దురదృష్టవశాత్తు మృతి చెందిన ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామానికి చెందిన శంకర్ గౌడ్ గీత కార్మికుని భార్య లక్ష్మికి 5 ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ఆదివారం ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సమక్షంలో డిపిఈఓ కె.మల్లారెడ్డి నిజామాబాద్ చెక్కును అందజేసినట్లు ఇందల్ వాయి మాజీ ఎంపిటిసి రామగౌడ్ తెలిపారు.