మహదేవ్‌పూర్‌ తాలూకా యూనిట్‌ సర్వసభ్య సమావేశం

– యూనిట్‌ ఎన్నికలో పాల్గొన్న
– టీఎన్జీఓ యూనియన్‌ అధ్యక్షులు బూరుగు రవి కుమార్‌
నవతెలంగాణ-మహదేవ్‌పూర్‌
మహాదేవపూర్‌ మండల తాలూకా యూనిట్‌ సర్వసభ్య సమావేశం మహ దేవ్‌పూర్‌ ఇరిగే షన్‌ గెస్ట్‌ హౌజ్‌ లో గురువారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జయశంకర్‌ జిల్లా టీఎన్జీఓ యూనియన్‌ అధ్య క్షులు బూరుగు రవి కుమార్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశంలో ఉద్యోగులను ఉద్దేశించి రవి కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగులు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఐఆర్‌, పీఆర్‌ సి అమలుపై ఉద్యోగులు నిరుత్సాహంతో ఉన్నా రన్నారు. భవిష్యత్‌ లో ఉద్యోగుల న్యాయమైన హక్కులైన పే స్కెల్‌ సీపీఎస్‌ రద్దు డీ ఏ ల సాధన కొరకు కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు మామిళ్ళ రాజేందర్‌ అన్న ,మారం జగదీశ్వర్‌ అన్న ల సహకారంతో కషి చేస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యల పట్ల, యూనియన్‌ నిరంతర పోరాటం చేస్తోందని బూరుగు రవి కుమార్‌ తెలిపారు. ఈ కార్య క్రమంలో జిల్లా కోశాధికారి దశరథ రామారావు, ఉపాధ్యక్షులు అన్వరుల్లా పాల్గొని యూనిట్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాదేవపూర్‌ మండల యూనిట్‌ అధ్యక్షులుగా సర్ధార్‌ హర్మిందర్‌ సింగ్‌, కార్యదర్శిగా అరుణ్‌ కుమార్‌, కోశాధికారి గా ఎన్‌ రాఘు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్‌, పధ్వీరాజ్‌, సహాయ కార్యదర్శి గా సారయ్య, ధర్మేంద్ర, గోవర్ధన్‌లు తదితులున్నారు.