జీవో 142ను సవరించాలి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వైద్య ఆరోగ్యశాఖలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మానవ వనరుల హేతుబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 142 ను సవరించాలని వైద్య ఆరోగ్యశాఖలోని ట్రేడ్‌ యూనియన్స్‌ (టీఆర్‌ఎస్‌కేవీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి, జనాభా ప్రాతిపదికన ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో సరిపడా సిబ్బందిని నియమించాలనీ, ఇప్పటికే పనిచేస్తున్న సిబ్బందిని ఎక్కువగా ఉన్నారనే పేరుతో క్రమ పద్ధతి లేకుండ ఇతర ప్రాంతాలకు పంపించడం అన్యాయమన్నారు, ఈ మేరకు శుక్రవారం ప్రజా ఆరోగ్య సంచాలకులుకు కలిసి వినతి పత్రం సమర్పించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె. యాద నాయక్‌, ఎండి ఫసియుద్దీన్‌, కె.బలరాం, టీఆర్‌ఎస్‌కేవీ నాయకులు సాయిరెడ్డి, రాజశేఖర్‌, ఐఎన్‌టియుసి నాయకులు బి వెంకటేశ్వర్‌ రెడ్డి, శ్యామ్‌ సుందర్‌, గోవింద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.