ఎర్రబెల్లి పర్వతగిరికి ప్యారాచ్యూట్‌ రెడీ చేసుకో

– కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్చార్జ్‌ ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ-తొర్రూరు
పాలకుర్తి ప్రజలు మార్పు కోరుతున్నారని, ఎర్రబెల్లి పర్వతగిరికి పారాచూట్‌ రెడీ చేసుకోవాలని కాంగ్రెస్‌ ని యోజకవర్గ ఇన్చార్జ్‌ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులు శనివారం డివి జన్‌ కేంద్రంలోని కాంగ్రెస్‌ క్యాంపు కార్యాలయంలో ఝా న్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భం గా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఊసర వెల్లి దయాకర్‌ రావును తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారన్నారు.పేదలకు భూములు ఇవ్వాలన్నా, ఇండ్లు కట్టించలన్నా, మన పొలాలకు నీళ్ళు రావాలన్నా,మన బిడ్డ లకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు ఏర్పాటు జరగా లన్నా రావాల్సింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అన్నారు.9 సంవత్సరాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే పే దల జీవితాలను ఆగం చేశారని, అన్ని వర్గాల ప్రజలను మోసగించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మిచ్చిన కాం గ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, తొమ్మిది సంవత్స రాలలో చేయని అభివృద్ధి, ఐదు సంవత్సరాల్లో చేసి చూపి స్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో 25 రోజులు యశస్విని రెడ్డి గెలుపు కోసం కష్టపడితే ఐదేళ్లు సేవకురాలుగా పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా వచ్చే వేతనాన్ని కూడా మీకే అంకితం చేస్తూ అభివృద్ధికి వెచ్చిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్‌, నాయకులు బిజ్జాల వరప్రసాద్‌, ఎన్‌ఎస్‌యు ఐ పాలకుర్తి నియోజకవర్గం అధ్యక్షుడు బసనబోయిన రా జేష్‌ యాదవ్‌, యూత్‌ నాయకులు బసనబోయిన వినోద్‌ కుమార్‌,తూర్పాటి రాంబాబు, చర్లపెళ్లి రవిశంకర్‌,అభి నా యక్‌ తదితరులు పాల్గొన్నారు.