
గాలికుంటు వ్యాధి నివారణకు ముందు జాగ్రత్త చర్యగా ఉచితంగా వేసే టీకాలను రైతులు తమ పశువులకు వేయించాలని దుర్కి ఎంపీటీసీ డాక్టర్ నారాయణ తెలిపారు. నసురుల్లాబాద్ మండలం డుర్కి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పశువులకు పోగులు (పశువుల ఆధార్ కార్డు) లేని వాటికి పోగులు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యామల శ్రీనివాస్ పశు సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.