
నవతెలంగాణ-డిచ్ పల్లి : ఇందల్ వాయి మండలంలోని వెంగళ్ పాడ్, పాటితండా కు చెందిన ఇద్దరు యువకులకు పోలీస్ కొలువులో చేరడంతో వారికి ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, బంజారా నాయకులు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు. వెంగళ్ పాడ్ కు చెందిన లావుడ్య సురేష్, లావుడ్య సన్య లు పోలిస్ శాఖ లో ఎఅర్ ఉద్యోగం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని, పట్టుదలతో ఉద్యోగం సాధించిన యువత, మిగతా యువతకు స్ఫూర్తి కావాలని ఆయన అన్నారు. యువత చెడు మార్గాలను వదిలి, తల్లిదండ్రుల గౌరవాన్ని తీసుకురావడానికి ప్రత్యేక కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ రాములు నాయక్,ఎంపీ కిషన్ నాయక్, అరటి రఘు,రాజు నాయక్,అంబర్ సింగ్, ఎంపిటిసి మారంపల్లి సుధాకర్, బాబు రావు,బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.