దశాబ్ది రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనానికి ఘనపురం దేవేందర్

నవతెలంగాణ – కంటేశ్వర్
జూన్ 11న హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని నిజామాబాద్ కు చెందిన ఉపాధ్యాయుడు, కవి ఘనపురం దేవేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జూన్ 11న ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సాహిత్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో కవితా పఠనం చేయడానికి తనకు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయం నుంచి ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ సాధించిన పురోగమనం గురించి చాటి చెప్పే అవకాశం రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.