మరొకసారి అవకాశం ఇవ్వండి మునుగోడును అభివృద్ధి చేస్తా: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం అల్లాపురం పీపల్ పహాడ్, నాగారం, కొయ్యలగూడెం,ఎల్లగిరి,ఎల్లంబాయి గ్రామాలలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మరొకసారి కేసీఆర్ గెలవబోతున్నాడు అని మునుగోడులో మరొకసారి నాకు అవకాశం ఇస్తే 571 కోట్లతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుందామని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓటేస్తే మునుగోడు నియోజకవర్గం మళ్ళీ 5 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి పోతుందని కూసుకుంట్ల అన్నారు.మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ రైతుల పక్షపాతి ప్రభుత్వం కేసీఆర్ ను నమ్మి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి, చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్,మాజీ జెడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి మండల కన్వీనర్ కొత్త పర్వతాలు యాదవ్,సర్పంచులు కొలను శ్రీనివాస్ రెడ్డి,కళ్లెం శ్రీనివాసరెడ్డి,రిక్కల ఇందిరసత్తిరెడ్డి, గుర్రం కొండయ్య,ఎలువర్తి యాదగిరి, చక్రం జంగయ్య మండల నాయకులు రిక్కల భాస్కర్ రెడ్డి, ఆల్మసిపేట కిష్టయ్య,మాచర్ల కృష్ణ,కొండ యాదగిరి, మెట్టు మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు