
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రజల కోసం కష్టపడి పనిచేసే వారికి అవకాశం కల్పించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కమ్మ సంఘం కళ్యాణ మండపంలో మండల కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సీతక్క హాజరై మాట్లాడారు. మండలంలో ఉన్న ప్రధాన సమస్యలైన లక్నవరం కాలువలకి గండ్లు పూడ్చి రైతులకు సాగు నీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలు దగ్గర పడగానే ఓట్ల కోసం అధికార పార్టీ నేతలు ప్రజల దగ్గరికి వస్తున్నారని, కానీ నేను గెలుపుతో సంబంధం లేకుండా తిరిగే నాయకురాలినని ప్రజసేవే లక్ష్యంగా ప్రజా సేవా చేస్తున్నానని అన్నారు. ఓట్ల కోసం అధికార పార్టీ చేసే గారడీ మాటలు నమ్మవద్దని, ప్రజల కష్టకాలంలో చూడడానికి కూడా రాని వారు ఇవ్వాళ ఓట్ల కోసం మీ గుమ్మాలు తొక్కుతున్నారు అని అన్నారు. గోవిందరావుపేట మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల లక్నవరం ప్రధాన కాలువలు దెబ్బ తిన్నాయని, వరి నాట్లు వేయకుండా రైతులు ఎదురుచూస్తున్న కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం కాలువల గండ్లు పూడ్చకుండ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అలాగే మండలంలో అర్హులైన పేదవారికి అందరికీ ఇండ్లు ఇస్తా అని చెప్పిన కెసిఆర్ గారు ఇప్పుడు నియోజకవర్గానికి 3000 మాత్రమే ఇస్తా అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అలాగే మండలంలో దాదాపు 2000 కు పైగా బీసీ కుటుంబాలు, 1000 కి పైగా మైనారిటీ కుటుంబాలు ఉంటే బీసీ బంధు, మైనారిటీ బంధు 20, 30 కుటుంబాలకు ఇవ్వడం ఏంటని, అందరికీ లబ్ధి చేకూర్చాలని అన్నారు. అలాగే కుర్చీ వేసుకుని మరీ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి మండలంలో పట్టుమని పది మందికి కూడా పట్టాలు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేశారు. పంట రుణమాఫి చేస్తానని నమ్మించి ఐదు సంవత్సరాలు దగ్గరికి వస్తున్న ఇంతవరకు పంట మాఫీ జరగలేదని రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. మండలం తరుపున తీర్మానం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సాగు చేసే ప్రతి ఒక్కరికీ పట్టాలు ఇస్తామని, పోడు భూములకు పట్టాలు అందిస్తామని, రైతులకు వెంటనే 2లక్షల ఋణమాఫీ చేస్తామని, అర్హులైన ప్రతి వారికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని, ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయిలు ఇస్తాం అని అన్నారు. అలాగే ఉచిత నిర్భంద విద్య, గిరిజన, మైనారిటీలకు 12% రిజర్వేషన్, ములుగులో మెడికల్ కాలేజ్ ఎటుపోయాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల సొమ్మును దోచుకుంటున్న భారాస పార్టీని గద్దె దించాలని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని ప్రజలను కోరారు. అలాగే భారాస పార్టీ అవినీతి పాలనను అంతమొందించడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన 150 మందికి నా యొక్క శుభాకాంక్షలు అని అన్నారు. అలాగే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి రెడ్డి, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవియాదవ్, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, ఆర్.టి.ఐ. జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పాశం మాధవ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి జంపాల చంద్రశేఖర్, జిల్లా ప్రచార కార్యదర్శి సూదిరెడ్డి జనార్ధన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సూదిరెడ్డి జయమ్మ, గోపిదాసు రజిత, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిగ పార్వతి, దేపాక కృష్ణ, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు కాడబోయిన రవి, పడిదల సాంబయ్య, మద్దాలి నాగమణి, భూక్య రాజు, చింత క్రాంతి, మండల సీనియర్ నాయకులు తేళ్ల హరిప్రసాద్, ఎంపీటీసీలు చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, గుండెబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, గోపిడాసు ఏడుకొండలు, సర్పంచులు భూక్యా సుఖ్యా, మంగ ఎలెంద్ర – నరసింహ, ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, బేతి దేవేందర్ రెడ్డి, మండల కమిటి నాయకులు, గ్రామ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాల్లు తదితరులు అందరూ పాల్గొన్నారు.