కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మెన్‌ అన్వేష్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వండి

– భట్టి విక్రమార్కకు కిసాన్‌ కాంగ్రెస్‌ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీకి కీలకమైన ‘కిసాన్‌ కాంగ్రెస్‌’ చైర్మెన్‌ సుంకేట అన్వేష్‌రెడ్డికి టికెటు ఇవ్వాలంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను ఆ విభాగం కోరింది. రైతు సమస్యలపై గడిచిన ఎనిమిదేండ్లుగా ఆయన నిరంతర పోరాటాలు చేస్తున్నారని గుర్తు చేసింది. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లోని భట్టి నివాసంలో కలిసి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. నిజామాబాద్‌ జిల్లాలో బలమైన శక్తిగా ఉన్న గురడి కాపు సామాజిక వర్గానికి చెందిన అన్వేష్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే… కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు చాలా మేలు జరుగుతుందని కోరారు. అన్ని జిల్లాల కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఉన్నారు.
ఎంఎస్‌ స్వామినాథన్‌ మృతి పట్ల రేవంత్‌ సంతాపం
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ మృతి పట్ల టీడీపీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. దేశంలో మేలైన వరి వంగడాలను సృష్ట్టించిన హరిత విప్లవానికి నాంది పలికిన స్వామినాథన్‌ మరణం దేశంలో వ్యవసాయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబానికి నా సానుభూతి తెలిపారు. హరిత విప్లవ మార్గదర్శకుడు స్వామినాథన్‌
తెలంగాణ రైతు సంఘం
హరిత విప్లవ మార్గదర్శకుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని తెలంగాణ రైతు సంఘం అభిప్రాయపడింది. గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏఐకేఎస్‌ సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ ఆరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ స్వామినాథన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.