నాని ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా చిత్రానికి కోర్ పాయింట్‌గా తండ్రీకూతుళ్ళ భావోద్వేగాలతో కూడిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఎంచుకున్నారు. నానికి జోడిగా మణాల్ ఠాకూర్ నటిస్తున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గురువారం సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ‘హారు నాన్న’ అనే ప్లజంట్ టైటిల్‌ను పెట్టారు. హిందీలో ‘హారు పాపా’ అనే టైటిల్‌ను లాక్ చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ టైటిల్‌లానే ప్లజంట్‌గా ఉంది. గ్లింప్స్‌లో నాని, మణాల్ అద్భుతంగా నటించారు. పాప అందరినీ ఆకట్టుకుంది. నూతన దర్శకుడు శౌర్యువ్ చిన్న గ్లింప్స్‌తో మనల్ని భావోద్వేగానికి గురి చేశాడు. హేషామ్ అబ్దుల్ వహాబ్ మనసుని కదిలించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఎమోషన్ జోడించారు. సాను జాన్ వరుగీస్ మాస్టర్ వర్క్ విజువల్స్‌లో కనిపిస్తుంది. ఓవరాల్‌గా టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తండ్రీకూతుళ్ల భావోద్వేగానికి భాష అడ్డంకి కాదు. సినిమా అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అని చిత్ర బృందం పేర్కొంది.
వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఇఒగా వ్యవహరిస్తున్నారు.
యూనిక్ స్టొరీ లైన్‌తో పూర్తిస్థాయి ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.