గోడాడీ యొక్క ఐరో ( Airo) సొల్యూషన్

చిన్న వ్యాపార యజమానులు తమ ఆన్‌లైన్ కార్యకలాపాలు ప్రారంభించటంలో, కొత్త కస్టమర్‌లను ఆకర్షించడంలో విలువైన సమయాన్ని ఆదా చేసే ఏఐ -ఆధారిత పరిష్కారం
నవతెలంగాణ హైదరాబాద్: చిన్న వ్యాపారాల కోసం, ప్రతి సెకను ఆదా చేయడం మరియు ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావటం ఆ వ్యాపార మనుగడ మరియు అభివృద్ధి చెందడం మధ్య వ్యత్యాసం చూపుతుంది.  గోడాడీ ఇటీవల 94% భారతీయ చిన్న వ్యాపార యజమానులు తమ వ్యాపారాలలో ఏఐ ని జోడించడం ద్వారా సానుకూల ప్రభావం చూడగలుగుతున్నారని కనుగొంది. అయితే, ప్రారంభించడానికి ముందు వారు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఏఐని అమలు చేయకపోవడానికి మొదటి మూడు కారణాలు –  అందుబాటులో ఉన్న పరిష్కారాల గురించి అవగాహన లేకపోవడం (50%), ప్రయోజనాలపై అవగాహన లేకపోవడం (45%), సంభావ్య ఖర్చులు (43%) మరియు ఈ సాధనాలను అమలు చేయడానికి సమయం లేకపోవడం (29% ) గా కనిపిస్తున్నాయి. ఉత్పాదక ఏఐ ని వేగంగా మరియు సులభంగా ఉపయోగించేందుకు, గోడాడీ ఇప్పుడు గోడాడీ ఐరో ని ప్రారంభించింది, చిన్న వ్యాపార యజమానులు తమ ఆన్‌లైన్ కార్యక్రమాలను ప్రారంభించటంలో మరియు కొత్త కస్టమర్‌లను ఆకర్షించడంలో విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు రూపొందించిన ఏఐ -ఆధారిత అనుభవం.

ఏదైనా చిన్న వ్యాపారం కోసం సరైన పరిష్కారం

ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే లేదా ఇప్పటికే ఉన్న దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనుకునే వారికి ఏఐ  యొక్క శక్తి పై ఆధారపడటాన్ని  గోడాడీ  ఐరో సులభతరం చేస్తుంది.  గోడాడీ  యొక్క ఏఐ డొమైన్ శోధన సాధనాన్ని ఉపయోగించి, వారి వ్యాపారం యొక్క వివరణతో ఆకర్షణీయమైన డొమైన్ పేర్లను గోడాడీ  ఐరో సిఫార్సు చేయవచ్చు. గోడాడీ  నుండి డొమైన్‌ను కొనుగోలు చేసిన నిమిషాల్లో, గోడాడీ  ఐరో, తక్షణమే వ్యాపారం కోసం కంటెంట్‌ను రూపొందించగలదు, దానితో పాటు :

  • వ్యాపారానికి సరిపోయేలా, సులభంగా అనుకూలీకరించబడే ప్రత్యేకమైన, ఆకర్షించే లోగో డిజైన్‌లు.
  • వ్యాపారాన్ని ప్రారంభించటం మరియు కస్టమర్లను ఆకర్షించడంలో సహాయపడటానికి రూపొందించబడిన చిత్రాలు మరియు కంటెంట్‌తో పూర్తిగా రూపొందించబడిన వెబ్‌సైట్.
  • వ్యాపారం యొక్క విశ్వసనీయత మరియు ప్రతిష్టను బలోపేతం చేసే వృత్తిపరమైన ఇమెయిల్ ఖాతా.
  • కేవలం ఉత్పత్తి ఫోటోను అప్‌లోడ్ చేయడం ద్వారా, ఆన్‌లైన్ స్టోర్ కోసం స్వయంచాలకంగా రూపొందించబడిన అనుకూల ఉత్పత్తి వివరణ సృష్టించబడుతుంది.

గోడాడీ  ఐరో, ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతోంది. చిన్న వ్యాపారాల కోసం గోడాడీ  ఐరో,  ఇప్పుడు అందుబాటులో వుంది మరియు మరిన్ని సామర్థ్యాలు రాబోతున్నాయి. “ఏఐ-శక్తితో కూడిన గోడాడీ  ఐరో, నిరంతరం అభివృద్ధి చెందుతుంది మరియు మెరుగుపడుతుంది, చిన్న వ్యాపారాలు తాజా సాంకేతికతలో ముందంజలో ఉండేలా చూస్తుంది ” అని గోడాడీ   ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లౌరా మెస్సర్‌స్మిట్ అన్నారు. “చిన్న వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది లేని  మరియు స్పష్టమైన పరిష్కారాలను అందించడం ద్వారా మనకు తెలిసిన రీతిలో వాడుక పరంగా  సౌలభ్యంతో సరికొత్త ఏఐ  సాంకేతికతను మిళితం చేసే అత్యాధునిక సాధనాలతో వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడం మా లక్ష్యం.” అని అన్నారు.