నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలో నర్సరీలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల పంచాయతీ అధికారి రఘు అన్నారు. శుక్రవారం దేవునిపడకల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ శ్రీశైలంతో, మండల పంచాయతీ అధికారి రఘు కలిసి గ్రామంలో పెంచుతున్న నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారి రఘు మాట్లాడుతూ నర్సరీ లో మొక్కల పెరుగుదల వంద శాతం ఉందని, సర్పంచ్ శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శి పనితీరు బాగుందని అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీశైలం మాట్లాడుతూ రాబోయే హరితహారం కార్యక్రమంలో వీలైనంత ఎక్కువ మేరకు శానిటేషన్ డ్రైవ్లో ప్రభుత్వం నిర్దేశించిన పనులు పూర్తి చేస్తామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జంగయ్య, వనసేవక్ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.