రూ.150 తగ్గిన బంగారం

న్యూఢిల్లీ : అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.150 పెరిగి రూ.59,900గా నమోదయ్యింది. కిలో వెండిపై రూ.850 తగ్గి రూ.74,500గా పలికిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్క ఔన్స్‌ పసిడి ధర 1,912 డాలర్లుగా, వెండి ధర 23.05 డాలర్లుగా చోటు చేసుకుంది.