
జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వర్ణజయంతి ఉత్సవాల్లో భాగంగా స్వర్ణ జయంతి ఉత్సవ భవనం వేద పండితులైనటువంటి ఎల్బాక వర ప్రసాద్ వారిచే నిర్వహించిన పూజా కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ఆవాల రాజారెడ్డి దంపతులు, ప్రబంధకారిణి అధ్యక్షులు శీలం శ్రీనివాస్ దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాపీఠం జిల్లా కార్యదర్శి తేళ్ల రాజమౌళి , ఉపాధ్యక్షులు డాక్టర్ చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు, పూర్వ పోషకులు, విద్యా అభిమానుల సూచన మేరకు సుమారు 50 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి ఆకుల రాజేందర్, ప్రబంధకారిని కార్యదర్శి దాసరి రవీందర్, అరకాల వీరేశలింగం, రఘుతం రెడ్డి , గుండా తిరుపతయ్య, డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.