
– చీఫ్ మెనెజర్ ఎస్బిఐ ఎఓ శాంసన్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
బ్యూటీ పార్లర్ కు ప్రస్తుతం మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉందని ఇలాంటి శిక్షణ లను సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ మెనెజర్ ఎస్బిఐ ఎఓ శాంసన్ నిజామాబాద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ అధ్వర్యంలో బ్యూటీ పార్లర్ శిక్షణా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ ఈ శిక్షణా ప్రస్తుతం మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉందని ఈ శిక్షణా ద్వారా ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారని దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పుడు ప్రతి మహిళ మేకప్ లేకుండా బయటకు వెళ్లడం లేదన్నారు. పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కి ప్రతి ఒక్కరూ మేకప్ చేయించు కుంటున్నారని వివరించారు. ఇంట్లో ఉండి చేసుకోవడానికి స్వంత కాళ్ళమీద నిలబడి ఎదగడానికి చాలా చక్కని అవకాశం అన్నారు. అర్ఎస్ఈటిఐలో నిర్వహిస్తున్న శిక్షణలు నాణ్యతతో నేర్పిస్తున్నారని, ఈ సంస్థలో నేర్చుకున్న ఎంతో మంది మహిళలు నేడు జీవితంలో చాలా చక్కగా స్థిరపడ్డారని వివరించారు. ప్రస్తుతం బ్యూటీ పార్లర్ కు మార్కేట్ లో మంచి డిమాండ్ ఉందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణా అనంతరం బ్యాంక్ ద్వారా ఋణా సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ రామకృష్ణ, నవీన్, రంజిత్, ప్రణిత, తోపాటు తదితరులు పాల్గొన్నారు.