పోడు పట్టాలలో రాజకీయ జోక్యాన్ని నివారించాలి : గౌని ఐలయ్య

నవతెలంగాణ-కొత్తగూడ
పోడు పట్టాలలో రాజకీయ జోక్యాన్ని నివారించి పోడు రైతులందరికి పట్టాలు ఇవ్వాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య రాష్ట్ర ప్ర భుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలోని పాలడుగు కృష్ణ స్మారక భవనంలో పిడిఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీశైలం అధ్యక్షతన న్యూ డెమోక్రసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 2005 చట్టం ప్రకారం పోడు సేద్యం చేస్తున్న రైతులందరి కీ పట్టా హక్కులు కల్పించాల్సి ఉండగా కొద్ది మందికి మాత్రమే పట్టాలిచ్చి గత పా లకులు చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పోడు రైతులకు జరిగిన అన్యా యాన్ని సరి చేస్తామని చెప్పి 2014 జూన్‌ 2 తెలంగాణ విభాగం నాటికి పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ కుర్చీ వేసుకుని పోడు సమస్య ను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చి నేటికీ రైతులకు ఇచ్చిన మాటను నిలబె ట్టుకోకపోగా గత పాలకులను తలదన్నే విధంగా మూడు రైతులను ఇబ్బందులకు గురి చేసారని ఆరోపించారు. అటవీశాఖ అధికారులు ఉసిగొలిపి పోడు భూముల లో కందకాలు తవ్వడం, పంట బోర్లను, కరెంటు లైన్లను ధ్వంసం చేయడం, పంట లను నాశనం చేయడమే కాక రైతులను వారి భూములనుండి బలవంతంగా వెల్ల గొట్టి హరితహారం మొక్కలు పెట్టించడం లాంటి విధ్వంసకర చర్యలకు పాల్పడ్డార న్నారు. రైతుల నుండి అటవీ శాఖ బలవంతంగా గుంజుకున్న పోడు భూములను రైతులకు అప్పగించాలన్నారు. ఓడు పట్టాల వివరాలను గ్రామసభల ముందు పె ట్టాలని, క్లయిమ్‌లను దరఖాస్తుదారులకు అందజేసి అప్పీల్‌ అవకాశం కల్పించాల న్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పోడు రైతుల పట్టాల విషయంలో పారదర్శకత పాటిం చాలని, రాజకీయ జోక్యం లేకుండా పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలన్నారు. ఇష్టానుసారంగా కొద్దిమందికి పట్టాలిచ్చి మెజారిటీ పోడు రైతులకు అన్యాయం చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలని, పోడు రైతులకు న్యా యం జరిగే వరకు పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జు దేవేందర్‌, మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి యుగంధర్‌, పిడిఎస్‌యూ జిల్లా కార్యదర్శి బోనగిరి మధు, నాయకులు రాజం నరసయ్య, సిద్ధబోయిన జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.