చదరంగ క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేధో వికాసానికి, బుద్ధి కుశలతకు దోహదం చేసే చదరంగం క్రీడాంశానికి రాష్ట్ర ప్రభుత్వం ‘సాట్స్‌’ ద్వారా ఎంతో ప్రోత్సాహం ఇస్తోందని శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. తెలంగాణ చెస్‌ అసోసియేషన్‌, (స్పోర్ట్స్‌ లోకల్‌ ఎరియా నెట్‌వర్క్స్‌) ఆధ్వర్యంలో జూలై 21 నుంచి 25వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న మొదటి అంతర్జాతీయ ఓపెన్‌ ఫిడే చెస్‌ టోర్నమెంట్‌ పోస్టర్‌ను డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ ఆవిష్కరించి మాట్లాడా రు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అన్ని రంగాల మాదిరిగానే దశాబ్ద కాలం నుంచి క్రీడారంగాన్ని అంచెలంచెలుగా అభి వృద్ధి చేశారని తెలిపారు. చెస్‌ క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదే అన్నారు. ఉప్పల ప్రవీణ్‌, నందిత వీర్లపల్లి లాంటి ఔత్సాహిక చెస్‌ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సహకాలు అందించారని గుర్తు చేశారు. వివిధ క్రీడా సంఘాలు నిర్వ హించే టోర్నమెంట్స్‌ విజయవంతం కావడానికి శాట్స్‌ తరపున పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, చంద్రమౌళి, నవీన్‌ నాయక్‌, నరేష్‌ పాల్గొన్నారు.