
ఉనికి చర్ల లోని సర్వే నంబర్ 324 ప్రభుత్వ భూమిని అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు పంచాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి రొయ్యల రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని విలీన గ్రామమైన పుణ్యక్షేర్ల గ్రామంలో సర్వే నంబర్ 324 ప్రభుత్వ పంచరాయి భూముల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 60 మంది ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకోవడానికి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో స్థానిక పోలీసులు వారిని నివారించి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అమ్మే హక్కు లేదని, కంచే చేను మేసిన చందంగా ప్రభుత్వమే ప్రభుత్వ భూములను వేలం పాటలు నిర్వహించి,అమ్మి వేయడం ఎంతవరకు సబబని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో అవసరమైతే ప్రభుత్వ ఆఫీసులో కట్టడాలకు ఉపయోగించాలి గాని, ప్రైవేట్ కూడా లేఅవుట్ చేసి అమ్మడం సరికాదని హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరాన్ని హెచ్చరించారు. అర్హులైన ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఈ ప్రాంతంలో ఇండ్ల స్థలాలు కేటాయించాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గోల్కొండ కుమార్, మండల నాయకులు విమల, ధార ప్రమీల, శ్యామ్, సత్తమ్మ, పెంట సక్సేన, వాసాల సారయ్య,అంబాల కుమార్,కార్యకర్తలు,నిరుపేద ప్రజలు తదితరులు పాల్గొన్నారు.