
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఒకే ఒక డిమాండ్ రెగ్యులరైజ్ టు సర్వీస్ దీనికోసం మా పోరాటం కొనసాగుతుందని రాబోవు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు వి దత్తాహరి అన్నారు. బుదవారం తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వి దత్తాహరి మాట్లాడుతూ.. రెగ్యులరైజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 12 యూనివర్సిటీ చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకుని రెగ్యులర్ చేయాలని విన్నవించారు.రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదువుకొని తమ యొక్క చదువు తోపాటు విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత గురువుల పైన ఉందనే విషయాన్ని గురువులుగా చదువులు బోధించి ఉత్తమ విద్యార్థులను తిర్చి దిద్దుతున్నమన్నారు. తెలంగాణలోని 12 యూనివర్సిటీలలో ఉపాధ్యాయులు ఎన్ఫీల్డ్ , పిహెచ్డి పబ్లికేషన్స్ టీచింగ్ అనుభవం ఉన్నవారే ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో కార్యచరణ ప్రకటించి 12 యూనివర్సిటీ లకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఒకే ఒక డిమాండ్ రెగ్యులరైజ్ టు సర్వీస్ దీనికోసం మా పోరాటం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో డాక్టర్ శరత్ ,డాక్టర్ గోపి రాజ్, డాక్టర్ జలంధర్ ,డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ డానియల్, డాక్టర్ గంగ కిషన్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ జోష్ణ, డాక్టర్ అప్పన్న, డాక్టర్ స్వామి రావు, డాక్టర్ బి.ఆర్ నేత తోపాటు తదితరులు పాల్గొన్నారు.