నవతెలంగాణ – చందుర్తి
బండపల్లి గ్రామ పంచాయతీ కార్మికుడు గసికంటి రామస్వామిని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా నాయకులు మాల్యాల నర్సయ్య అన్నారు. గతకొంత కాలంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్మికునిగా పనిచేస్తున్న రామస్వామి అనారోగ్యా కారణంగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం కోసం డబ్బులు లేక దీన స్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం రామస్వామికి మెరుగైన వైద్యం అందించాలని నర్సయ్య కోరారు.