వినాయక నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్..

Government Whip who participated in Vinayaka Navratri celebrations..నవతెలంగాణ – వేములవాడ రూరల్
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలోని భగవంత రావు నగర్ లో గణేష్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో  గణనాథున్ని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్  దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండప నిర్వహకులు ప్రభుత్వ విప్ ను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట మండప నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు.