– బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం
– కార్మికుల బిక్షాటనకు విరాళం అందజేత
నవతెలంగాణ-బెజ్జంకి
గత పన్నెండు రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వ తీరుకు నిరసన చేపట్టిన బిక్షాటన కార్యక్రమానికి నిషాని రామచంద్రం విరాళం అందజేశారు. పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న సిబ్బంది అధికంగా బడుగుబలహీన వర్గాలకు చెందిన ప్రజలేనని.. బహుజన రాజ్యాధికారంలో బీఎస్పీ పార్టీ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించి సముచిత స్థానం కల్పిస్తుందని రామచంద్రం సూచించారు.రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీని గద్దేదించాలని కార్మికులకు సూచించారు. బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.