రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్‌ వ్యవహారం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై చట్టాన్ని చేతిలోకి తీసుకుని రాజ్యాంగ విరుద్ధం గా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ విమ ర్శించారు. గవర్నర్‌ కోటాలో దాసోజు శ్రావణ్‌, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై మంత్రివర్గం చేసిన సిఫారసులను ఆమె తిరస్క రించటం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే గవర్నర్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని గవర్నర్లు ఇలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా..? అని రాజీవ్‌సాగర్‌ ప్రశ్నించారు.
బీజేపీ డైరెక్షన్‌లో గవర్నర్‌ : గెల్లు
గవర్నర్‌ తమిళి సై బీజేపీ డైరెక్షన్‌లో పని చేస్తున్నారని టూరిజం కార్పొరేషన్‌ చైర్మెన్‌ గెల్లు శ్రీనివాసయాదవ్‌ విమర్శించారు. దేశంలో ఏ గవర్నర్‌ ఇలా వ్యవహరించలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాసోజు శ్రావణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను తిరస్కరించటం ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలను గవర్నర్‌ అవమానించారని తెలిపారు.