టి.బి ఉద్యోగులందరికీ ప్రభుత్వం వెంటనే జీతాలు ఇవ్వాలి

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న టి.బి ఉద్యోగుల లో ల్యాబ్ టెక్నీషియన్ కు ఇతర క్యాడర్ ఉద్యోగస్తులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరికీ రెండు నెలల వేతన బకాయిల గాను ఒక నెల వేతనం కొంతమందికే చెల్లించి, మిగతా వాళ్ళకు శాలరీ ఇవ్వకపోవడంతో  మనో వేదనకు గురవుతున్నారన్నారు. అధికారులు  పక్షపాతంతో వ్యవహరించకుండా అందర్నీ సమానంగా గుర్తించి వెంటనే జీతాలు చెల్లించాలని  టీ బి.సి.సి.ఏ స్టేట్ ప్రెసిడెంట్ నంద్యాల  కిషన్ రెడ్డి  మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే మిగతా ఉద్యోగులపై ఎలాంటి పక్షపాతం లేకుండా జీతాలు అందించాలని కోరారు.