నవతెలంగాణ-భిక్కనూర్: భిక్కనూరు పట్టణానికి చెందిన న్యాయవాది గజ్జెల బిక్షపతి కుటుంబాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమవారం పరామర్శించారు. న్యాయవాది తల్లి మల్లవ్వ మరణ వార్త తెలుసుకొని ఆయన నివాసంలో పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వ విప్ వెంట నాయకులు నల్లవెల్లి అశోక్, వాసవి క్లబ్ అధ్యక్షులు సుదర్శన్, తదితరులు ఉన్నారు.