గౌడ సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టాలి

Gowda subplan should be introduced– కాంగ్రెస్‌ నేత మల్లు రవికి గౌడ, కల్లుగీత సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గౌడ సబ్‌ప్లాన్‌ను ప్రవేశ పెట్టా లని తెలంగాణ గౌడ, కల్లుగీత సంఘాల సమ న్వయ కమిటీ కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో సలహాదారులు మల్లు రవిని మంగళవారం హైదరా బాద్‌లో ఆ సంఘం చైర్మెన్‌ బాలగౌనీ బాలరాజుగౌడ్‌, రాష్ట్ర కన్వీనర్‌ అయిలి వెంకన్నగౌడ్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు. గౌడ సబ్‌ప్లాన్‌కు సంబంధిం చిన అంశాన్ని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో చేర్చాలని కోరారు. వైన్స్‌, బార్లలో 50 శాతం సబ్సిడీతో కల్లుగీత సొసైటీలకు ఇవ్వాలనీ, లిక్కర్‌ కంపెనీలను 50 శాతం గౌడ్‌లకే ఇవ్వాలని చెప్పారు. 50 ఏండ్లు దాటిన గీత వృత్తిదారులకు రూ.ఐదు వేల పెన్షన్‌ చెల్లించాలన్నారు. గీత వృత్తిని ఆబ్కారీ శాఖ నుంచి తొలగించాలనీ, ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జనగామ జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాపన్న పేరును, సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు పెట్టాలని కోరారు. గౌడల సమస్యలను మ్యానిఫెస్టోలో చేర్చిన పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.