మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్న జీపీ సిబ్బంది

GP staff preparing for strike once again– భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి
నవతెలంగాణ-తొర్రూరు
గత రెండు నెలల క్రితం తమ డిమాండ్ల పరిష్కారం కోసం 34 రోజుల నిర వధిక సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవటానికి నిరసనగా మరోసారి జేఏసీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారని భార త కార్మిక సంఘాల సమాఖ్య మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అ న్నారు. ఆదివారం తొర్రూర్‌ లోని స్థానిక ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన గ్రా మపంచాయతీ కార్మికుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ 34 రోజుల సమ్మె తర్వాత రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమ్మె విరమించండి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నేటికి 60 రోజులు గడిచిన ఎలాంటి స్పందన లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పం చాయతీ కార్మికులపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరోసారి సెప్టెంబర్‌ 21న సమ్మె నోటిస్‌ ఇవ్వాలని జేఏసీ నిర్ణయించిందని రవి తెలిపారు. దానికంటే ముందుగా సెప్టెంబర్‌ 20 నుంచి 24 వరకు గ్రామాలలో ప్రజల వద్దకు పోయి సంతకాల సేకరణ చేయాలని,25,26,27 తేదీలలో జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.ఈ సమావేశంలో యూ నియన్‌ మండల అధ్యక్షుడు గుండాల సోమ నరసయ్య అధ్యక్షత వహించగా మా లోతు యాకయ్య,, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.