6 నుండి సమ్మెలోకి జీపీ కార్మికులు

 నవతెలంగాణ -మోటకొండూర్‌
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జీపీ కార్మికులు, ఉద్యోగులు జులై 6నుండి సమ్మెలోకి వెళ్లనున్నట్టు గ్రామపంచాయతీ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ పొట్ట యాదమ్మ తెలిపారు. గురువారం సమ్మె నోటీస్‌ను ఎంపీడీవో వీరస్వామికి అందజేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక జేఏసీ చైర్మెన్‌ కొల్లూరు ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జీవో నెంబర్‌ 60 ప్రకారం గ్రామపంచాయతీ సిబ్బందిని అందర్నీ పర్మినెంట్‌ చేయాలని 30శాతం పీఆర్‌సీ ప్రకారం రూ.19వేలు కనీస వేతనం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మండల చైన్‌ర్మె కొల్లూరు ఆంజనేయులు, జిల్లా కన్వీనర్లు గడ్డం ఈశ్వర్‌, బందెల బిక్షం, మండల నాయకులు ఆడెపు స్వామి, గోసంగి పరమేష్‌, భోగారం వీరస్వామి ,బొట్ల గణేష్‌ ,గంధముల నరసింహ , బోట్ల అరుణ, తదితరులు పాల్గొన్నారు.