రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం
నవతెలంగాణ – చండూర్
వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం చండూరు మండల పరిధిలోనికొండాపురం గ్రామంలో పీఏసీిఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత గోనె సంచులకు రంద్రాలు ఉన్నాయని పేరుతో అదనంగా తూకం వేస్తున్నారనిఆయన అన్నారు.కొన్ని కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత తీవ్రంగా ఉందని, ఆ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రంగు మారిన, మొలకెత్తిన వరి ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, మునుగోడు మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు,రైతులుఈరటి పెంటయ్య,కడారి అంతయ్య, ఇరిగి శ్రీశైలం, బిక్షమయ్య, రాజుతదితరులు పాల్గొన్నారు.
మునుగోడు:రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టడం సరైనది కాదని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండా శ్రీశైలం మండిపడ్డారు. సోమవారం మండలంలోని కొంపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ బాధ్యత వహించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు . రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమ , తాలు పేరుతో కొనుగోలు చేయకుండా రోజుల తరబడి రైతులను రాశుల వద్ద పడి కాపులు కాపిస్తున్నారని మండిపడ్డారు . కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం వర్షానికి తడిచిన ధాన్యాన్ని తాలు , తేమ షరతులను విధించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి మిరియాల భరత్ , సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు , మండల నాయకులు యసరాని శ్రీను , సాగర్ల మల్లేష్ , పగడాల కాంతయ్య , వడ్లమూడి హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.