
నవతెలంగాణ-బెజ్జంకి
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ అవరణం వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శిభిరాన్ని సీపీఐ(ఎం)నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పరిపాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలతో పాటు వారికి నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని..ఇప్పటికైన ప్రభుత్వం కార్మికులను మభ్యపెట్టడం మానుకుని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కార్మికుల నియామకం చేపట్టి క్రమబద్ధీకరణ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.సీపీఐ(ఎం) నాయకులు,గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.