6వ తేదీ నుంచి గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె

– సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేత
– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్‌
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
ఈనెల 6 నుండి గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షు లు కే శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రా మపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6 నుండి సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె కొ నసాగిస్తామని అందులో భాగంగా సోమవారం తాం డూరు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో కార్మి కులు సమ్మె నోటి అందజేశారు. ఈ సందర్భంగా సీ ఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు. కే. శ్రీనివాస్‌. మాట్లా డుతూ. తాండూర్‌ నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరు జులై 6 నుండి గ్రామ పంచాయతీ పనులు బందు పెట్టి సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పెరిగిన జీతాలు పెండింగ్‌ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్రామపం చాయతీ సిబ్బందిని వెంటనే పర్మినెంట్‌ చేయాలి జీవో నెంబర్‌ 51 ని వెంటనే రద్దు చేయాలని జీవో నెంబర్‌ 60 ప్రకారం గ్రామ పంచాయతీ వర్కర్లకు వేతనాలు చెల్లించాలన్నారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచా యతీలు ఉన్నాయి సుమారుగా రాష్ట్రంలో 50,000 మంది గ్రామపంచాయతీ వర్కర్లు ఉన్నారని తెలి పారు. వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని కనీస వేతనాలు రూ. 26 వేలు ఇవ్వాలని పిఎఫ ఈ ఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో శాంతమ్మ, నర్సిములు, లక్ష్మి, కిష్టప్పఅంజిలప్ప వెంకటప్ప కార్మికులు రవి మాణిక్యప్ప అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.