గద్దర్ కు గ్రామపంచాయతీ కార్మికుల నివాళి

నవతెలంగాణ- నవీపేట్: ప్రజా యుద్ధనౌక గద్దర్ కు గ్రామ పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలో చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ విప్లవ కవి, గాయకుడు, ఉపన్యాసకుడై తెలంగాణ పోరాటంలో క్రియాశీల పాత్ర వహించిన గద్దర్ మరణం కార్మిక వర్గానికి తీరని లోటని అన్నార ఈ కార్యక్రమంలో ఆంజనేయులు నరేష్ భుజంగరావు తులసి రామ్ మరియు కార్మికులు పాల్గొన్నారు.