
రైతులపై మోడీ ప్రభుత్వ దమనకాండను ఖండిస్తూ మోడీ దిష్టిబొమ్మ దగ్ధం ఐ ఎఫ్ టి యు, సిపిఐ ఎంఎల్, న్యూడెమోక్రసి, సీపీఐ(ఎం), సిపియుస్ఐల గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ రైతన్న సమస్యలను పరిష్కరించాలని, మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గత రెండు రోజులు గా ఢిల్లీలో ర్యాలీ చేస్తున్న రైతులపై నరేంద్ర మోడీ ప్రభుత్వ ధమనకాండను ఖండిస్తూ యాదగిరిగుట్ట మండలం కాచారం శుక్రవారం, బస్టాండ్ వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ ఐఎఫ్టియు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి, సీపీఐ(ఎం), సి పి యు ఎస్ ఐ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. సీపీఐ ఎంఎల్, న్యూడెమోక్రసి డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి బీబీనగరం బాబు, సిపిఎం మండల నాయకులు వంటేరు పెంటారెడ్డి, సిపిఎస్ యుఐ జిల్లా కార్యదర్శి సుంచు దేవయ్య, అఖిలభారత రైతు కూలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బర్మ బాబులు మాటలాడుతూ మోడీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ, రైతాంగ, కార్మిక సంఘాల డిమాండ్లను నెరవేర్చాలని ఈ రోజున జాతీయ గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేసినారు. రైతులకు మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ కరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారని, రైతు పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితుల్లో లేరని, కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని, పని గంటల విధానం పెంపొందిస్తుందని వారన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందూ మతోన్మాదం మీద దృష్టి పెట్టకుండా ప్రజల సమస్యల పరిష్కారం వైపు ఆలోచన చేయాలని అన్నారు. రైతాంగ కార్మిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు.ఈ బంధు కార్యక్రమంలో కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు సుంచు ఆంజనేయులు, హమాలీ సంఘం అధ్యక్షులు ఇప్ప బిక్షపతి , సీనియర్ నాయకులు సుంచు రాములు, గ్రామ నాయకులు గ్యార నరసింహులు, నమిలే ఎల్లయ్య, బెజాడి రాములు, పారెల్లి వెంకటయ్య, గ్యార మహేందర్ , నరేందర్ తదితరులు పాల్గొన్నారు.