శాంతి నిలయంలో ఘనంగా దీపావళి సంబరాలు

నవతెలంగాణ-వైరా టౌన్
దీపావళి పండుగను పురస్కరించుకుని మానసిక వికలాంగుల శరణాలయం శాంతి నిలయం నందు మార్పు స్వచ్ఛంద అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. గుడిమెట్ల రజిత మానసిక వికలాంగ పిల్లలతో కలిసి క్రాకర్సు కాల్చుతూ వారికి ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కల్పించారు. అనంతరం అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత మాట్లాడుతూ శాంతి నిలయంలోని మానసిక వికలాంగుల మధ్య దీపావళి పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ పండుగలను అనాధలు, దివ్యంగులు మధ్య జరుపుకోవడం వలన వారుకూడా ఆనందంగా జీవిస్తారని,  ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు ఉంటాయని వాటిని అధిగమించి సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడిమెట్ల వెంకట రోషన్, శాంతి  నిలయం  నిర్వాహకులు సిస్టర్స్ ఆల్ ఫీ, ప్రేమ, మేరి, రోసాలియా, విద్యార్థులు సోను, కావ్య, నాగమణి, మేఘన, అంబిక, వెంకటలక్ష్మి, అనూష తదితరులు పాల్గొన్నారు.