ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
సీఎస్ పిఎస్ఐ ఆధ్వర్యంలో….
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కన్జ్యూమర్ సేల్స్ ప్రొఫెషనల్ సొసైటీ ఇందూర్ (సీఎస్ పిఎస్ఐ) ఆధ్వర్యంలో అధ్యక్షులు మెతుకు శివకుమార్ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రాజేందర్ రెడ్డి , ఎగ్జిక్యూటివ్ సభ్యులు రాకేష్ ,విజయ్,గౌతమ్ రెడ్డి, రాజు,గుణాకర్, భాను మరియు తదితరులు పాల్గొన్నారు.
అన్షుల్ హాస్పిటల్ లో….
నగరం లోని ఖలీల్ వాడి ప్రాంతంలో అన్షుల్ ఆసుపత్రిలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్షుల్ హాస్పిటల్ చైర్ పర్సన్ వేమనేని బాలకిషన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇంచార్జీ మలవత్ భూపతి నాయక్, అన్షుల్ హాస్పిటల్ సిబ్బంది అరవింద్, రాజు, పద్మా, మౌనిక, సోని తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ కార్యాలయం లో…
జెడ్పీ కార్యాలయం లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఓయసీస్ స్కూల్ ఆద్వర్యంలో….
నగరంలోని ఆనంద్ నగర్ లోని ఓయసీస్ స్కూల్ లో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్కూల్ లో ఓయసీస్ ప్రిన్సిపాల్ శారద జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆనంద్ నగర్ ప్రాంతంలో దేశభక్తి నినాదాలతో గల్లిలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి ఘనంగా నిర్వహించారు.
టీడీపీ ఆధ్వర్యంలో….
నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా (తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి గతంలో ఇచ్చిన స్థలంలో) సుభాష్ నగర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద టిడిపి ఆధ్వర్యంలో జాతీయ జెండాను టిడిపి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి దేగం యాద గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకుముందే ఉన్న మా పార్టీ కార్యాలయ స్థలానికి భవన నిర్మాణ పరిమితులు ఇయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కమిటీ నాయకులు జ్యోతి నారాయణ, అర్బన్ ఇంచార్జ్ వినోద్ కుమార్, రాష్ట్ర అనుబంధ కమిటీ నాయకులు కోయెడి నర్సింలు, అనుబంధ సంఘ అధ్యక్షులు దంతాల ఆనంద్, మావూరి రాజశేఖర్, ఫిరోజ్, అర్బన్ సీనియర్ నాయకులు కల్లెడ గంగాధర్, అతిక్, శేఖర్, రవి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాల లో….
మెడికల్ కళాశాలలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వైద్య విద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ జనరల్ మెడిసిన్ లో గోల్డ్ మెడల్ సాధించిన పంచరెడ్డి నిఖితకు ప్రశంసా పత్రం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజీడీఏ డాక్టర్ జలగం తిరుపతిరావు, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగమోహన్, ఏఓ మధుసూధన్, సూపర్డెంట్ పెద్దల నాగరాజు, కళాశాల గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో….
నగరంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.