నవతెలంగాణ రెంజల్
రెంజల్ మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా గ్రామాలలోని సర్పంచులు, ఘనంగా జరుపుకున్నారు. రెంజల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రజిని కిషోర్, రెంజల్ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచి ఎం ఎస్ రమేష్ కుమార్, తాహాశీల్దార్ కార్యాలయంలో తాహశీల్దార్ రామచందర్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఉదయ్ కుమార్, రెంజల్ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ మొయినుద్దీన్, పిఎస్సీలో డాక్టర్ వినయ్ కుమార్, ఐకెపిలో మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచులు జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.