
మండల కేంద్రంలో స్థానిక హరిజనవాడ కాలనీలోకి వెళ్లే రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోటి 5లక్షల రూపాయల నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణ బిఆర్ఎస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు డప్పు రవి బుధవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ విప్ అడిగిన వెంటనే నిధులు కేటాయించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ది రామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ డైరెక్టర్ తాటికొండ బాబు, నర్మూల రామచంద్రం, ఎంపీటీసీ ఉప్పల బాబు, వార్డు సభ్యురాలు సుజాత, సత్తూరి బాలరాజు, తాటికొండ రమేష్, స్వామి, సురేష్, పెద్ద ఎత్తున దళిత నాయకులు పాల్గొన్నారు.