ఘనంగా బక్రీద్ పండగ..

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామంలో బక్రీద్ పండుగ ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాలలో ప్రత్యేక పార్థనలు చేశారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒక్కరి కొక్కరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.